telugu navyamedia
రాజకీయ వార్తలు

వచ్చే వారం నుంచి రవాణా సౌకర్యాలు: ట్రంప్

trump usa

అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్టు వైట్ హౌస్ లో విలేకర్ల సమావేశంలో ట్రంప్ వెల్లడించారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారీ ర్యాలీలకు సైతం అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.

వచ్చేవారం తొలిసారిగా వాషింగ్టన్ వదిలి అరిజోనా పర్యటనకు ట్రంప్ వెళ్లనున్నారు. అయితే, ఈ పర్యటనలో రాజకీయ పరమైన ఉద్దేశం లేదని, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడానికేనని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల మందితో భారీ సభలు నిర్వహిస్తానని వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో కీలకమైన ఒహాయో రాష్ట్రంలోనూ పర్యటిస్తానని తెలిపారు. కరోనా విషయంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

Related posts