telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ సెక్రటరి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షల పలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  పదోతరగతి ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు హాజరయ్యారు.

వీరిలో బాలురు 2,7,952 మంది, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ..

పరీక్షలు ముగిసిన మూడు వారాల్లోనే ‘టెన్త్’ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికే ముగిసింది.

వారం రోజుల్లోనే డీకోడిండ్‌ ప్రక్రియ కూడా ముగించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమైంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన అమ్మాయిలు..
బాలురు ఉత్తీర్ణత శాతం 89.42%
బాలికల ఉత్తీర్ణత శాతం 93.23%

ఈ సంవత్సరం రాష్ట్రా వ్యాప్తంగా 3927 స్కూల్ లలో 100% ఉత్తీర్ణత నమోదైంది

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

Related posts