telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

వారఫలాలు : వ్యాపారాలు ఆశాజనకంగా .. ధనవ్యయం..

today rasi falalu

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యూహాలు అమలు చేసి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత సానుకూలత. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు, కొన్ని కోర్టు వ్యవహారాలు పరిష్కారదశకు చేరతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పలుకుబడి మరింత పెంచుకుంటారు. ఆత్మీయులు మరింత సహాయపడతారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. వాహనయోగం. కొత్త ఉద్యోగాన్వేషణలో విజయం సా«ధిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. విద్యార్థులు నైపుణ్యం చాటుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది. కళారంగం వారికి అనుకూల సమయం. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మధ్యలో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం, శక్తిసామర్థ్యాలను అందరూ గుర్తించే సమయం. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. అనారోగ్యం. పసుపు,ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. అయితే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగుపడతాయి. సన్నిహితులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. కొన్ని నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఉద్యోగాన్వేషణలో కొంత పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకలకు హాజరవుతారు. ఇంటాబయటా మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆలోచనలు అమలు చేసి సత్తా చాటుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉండవచ్చు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు మొదట్లో నత్తనడకన సాగినా సమయానికే పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఎంతటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబంలో శుభకార్యాలలో నిర్వహిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆశ్చర్యకరమైనరీతిలో అవకాశాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆస్తి విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నేర్పుగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆస్తుల ఒప్పందాలలో అవాంతరాలు. వాహనాలు, భూముల కొనుగోలు ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

Related posts