telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

13,434 ప్లాస్టిక్ బాటిళ్ల మూతలతో గిన్నిస్ రికార్డు బద్దలు

DUbai

దుబాయికి చెందిన ఓ స్కూలు విద్యార్థులు గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టారు. జెమ్స్ ఆల్ బర్షా నేషనల్ స్కూల్ ఆఫ్ బాయ్స్‌లోని సుమారు 400మంది విద్యార్థులు ఈ సరికొత్త రికార్డు సృష్టించారు. దీనికోసం ఆ విద్యార్థులకు కేవలం ఒక గంట సమయం మాత్రమే పట్టడం విశేషం. వీరంతా కలిసి యూఏఈ జెండాలో ఉండే తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న 13,434 ప్లాస్టిక్ బాటిళ్ల మూతలు సేకరించారు. ‘జాయేద్ లక్ష్యాలు అంతరిక్షాన్ని అక్కున చేర్చుకుంటాయి’ అని అర్థం వచ్చేలా ఈ ప్లాస్టిక్ మూతలను అరబిక్ భాషలో పేర్చారు. దీంతో అత్యధిక ప్లాస్టిక్ మూతలతో సృష్టించిన మోజాయిక్‌గా ఇది గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతంలో జపాన్‌కు చెందిన కొందరు విద్యార్థులు 5009 మూతలతో రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు దుబాయి విద్యార్థులు దాన్ని బద్దలుకొట్టారు.

Related posts