telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిట్టే గుర్తింపు… లేదంటే ఎవడు డేకడు .. : పూరి

Ram-and-Puri

ఇస్మార్ట్ శంకర్ అటు దర్శకుడు పూరికి, ఇటు నటుడు రామ్ కు మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ”. ఈ సినిమా గత వారం విడుదలై అన్ని సెంటర్లలోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీసీ సెంటర్ల ప్రేక్షకులైతే ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు. ఆ ఇద్దరు ఒక మంచి హిట్ కోసం ఆకలితో ఉన్నవారే. మొత్తానికి ఈ చిత్రంతో ఆ ఆకలి కాస్తా తీరిపోయింది. ఇక మొదటి నుండి సినీ పరిశ్రమలో ఉన్న జాడ్యమే, ఎవరికైన హిట్ ఉంటేనే అతడికి అవకాశాలు.. లేదంటే పస్తే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

నాకు సరైన హిట్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. అందుకే ఈ సినిమా ఫలితం గురించి ఎంతగానో కంగారుపడ్డాను. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్నాను. అంతేకాకుండా లైఫ్‌లో ఫస్ట్ టైం హిట్ కావాలని దేవుడిని బలంగా కోరుకున్నానని పూరి జగన్నాధ్ వెల్లడించాడు.

కెరీర్‌లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఎన్నో ప్లాప్స్ ఎదురుకున్నా.. ఆ టైంలో నాకు తోడుగా నా ఫ్యామిలీ తప్ప.. ఎవరూ కూడా నన్ను ఆదుకోవడానికి ముందుకు రాలేదని పూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క హీరో కూడా తనను పట్టించుకోలేదని అన్నారు. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో చాలా ఖంగారు పడ్డానని.. ఖచ్చితంగా హిట్ రావాలని కోరుకున్నాను.. ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూసిన తర్వాతే నాకు రీలీఫ్ వచ్చిందని పూరి జగన్నాధ్ వెల్లడించాడు.

Related posts