సిఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని.. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి, ఇవి మన జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. ఫోకస్‌గా టెస్టులు చేయాలని.. గ్రామాల్లో చేస్తున్న ఫీవర్ సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని.. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలని..ఎవరైనా కోవిడ్ పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలన్నారు. అన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని.. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 89 శాతం మంది కోవిడ్ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని.. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారని కొనియాడారు. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని.. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని తెలిపారు.
previous post
next post