ప్రతి ఏటా బతుకమ్మ పురస్కార అవార్డుల కోసం ఎస్‌ఎస్‌కె ఆర్ట్ ఆకాడమీ హైదారాబాద్ వారి ఆధ్వర్యంలో అందించే పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వ్యవస్థాపకులు వాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు సంగీతం, సాహిత్యం, నృత్యం, సామాజిక సేవలకు సంబంధికులు అర్హులని, వీరికి వచ్చే నెల అక్టోబర్ 4న తెలుగు యూనివర్సీటి నాంపల్లిలో బతుకమ్మ పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతిభను చాటిన వారికి ప్రముఖులచే ఈ అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 20 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని, అధిక వివరాలకు 7702313168 నంబర్‌ను సంప్రదించగలరు.