నంది అవార్డ్ గెలుచుకున్న `గంగపుత్రులు` చిత్రం ఫేం రాంకీ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం `జర్నలిస్ట్`. జి.ఆర్ .కె ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ సమర్పణ. కె.మహేష్ దర్శకులు. తషు కౌశిక్ హరోయిన్ గా నటించగా ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో రాంకీ మాట్లాడుతూ…“సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకు ఎంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదటిగా జర్నలిస్ట్ లు ఉంటారు. అందుకే వారిపై ఈ సినిమా చేశాను. జర్నలిస్టులు సమాజానికి, జనాలకి మంచి చేయాలనే సదాభిప్రాయంతో జర్నలిజాన్ని కెరీర్ గా ఎన్నుకుంటారు తప్ప ..కోట్లు సంపాదించాలని కాదు. లైఫ్ రిస్క్ చేసి నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్ట్ పెన్నుకు ఎంతటివారైన భయపడాల్సిందే. నిజమైన జర్నలిస్ట్ ఎంత బాధ్యతతో ఉంటాడో చూపించే ప్రయత్నమే మా జర్నలిస్ట్. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ గారు కథ నచ్చి మా సినిమా చేశారు. అలాగే సీనియర్ నటులు చలపతి రావు గారు, సురేష్ గారు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా పూర్తి చేశాం. ఫిబ్రవరి 5న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు. నటుడు సుబ్బారావు మాట్లాడుతూ…“పొలిటీషియన్స్, మీడియా అధినేతలు జర్నలిస్ట్ లను ఎలా వాడుకుంటున్నారో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరిగింది. ఇందులో నేనొక కీలకమైన పాత్ర చేశాను“ అన్నారు. సమర్పకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ…“సొసైటీలో జర్నలిస్ట్ పాత్ర ఎంత గొప్పదో మా సినిమాలో చూపించాం. రాంకీకి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది“ అన్నారు. ఎన్.శంకర్, చలపతిరావు, సురేష్ మైసూర్, గిరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః రఘుకుంచె, డా.జోశ్యభట్ల, సినిమాటోగ్రఫీః ముజీర్ మాలిక్; ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరావు, పీఆర్ ఓః రమేష్ చందు (బాక్సాఫీస్) దర్శకత్వంః కె.మహేష్; నిర్మాతః జి.రామకృష్ణ.
previous post