telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగా హీరోల టీనేజ్ పిక్ వైరల్

Mega

టాలీవుడ్ లో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా మెగా ఫ్యామిలీ హీరోల టీనేజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలో బన్నీ, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మరియు నిహారిక కూడా ఉన్నారు. టీనేజ్ లో ఉన్న మెగా హీరోల లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక మెగా అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉంటే… బన్నీ “పుష్ప” సినిమాతో, చరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక వరుణ్ తాను నటిస్తున్న బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. “తేజ్ సోలో బ్రతుకే సో బెటర్” అంటూ సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అరడజన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.

Related posts