telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కినేని నాగార్జునతో సోనాక్షి రొమాన్స్ !

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని ‌మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధించింది. అయితే  నాగార్జున హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. అందుకే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఆ సినిమాకు సీక్వెల్ తీస్తామని చెప్పారు. అదే పనిలో ఉన్నారు. టైటిల్ కూడా ‘బంగార్రాజు’ అని కన్ఫామ్ చేశారు. అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ సంవత్సరం పట్టాలెక్కుతుందని ప్రకటించాడు నాగార్జున. ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఓ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. నాగ్ కి జోడీగా కొత్తగా ఉంటుందని ఆలోచనట. ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్, జూలై లో మొదలెట్టాలనుకున్నారు. ఇప్పుడు కరోనా వేవ్ తో ఎప్పటి నుంచి ఆరంభమవుతుంతో తెలియటం లేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలన్నది నాగ్ ఐడియా. చూద్దాం ఏం జరుగుతుందో. 

Related posts