telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ ఆఫర్ కోసం రశ్మిక భారీ గ్లామర్ షో!

ముంబై హీరోయిన్స్ అయినా సౌత్ వైపు వస్తే కాస్త పద్ధతిగా ఉంటారు. గ్లామర్ డోస్ తగ్గిస్తుంటారు. కానీ, వాళ్లే ముంబైకి తిరిగి వెళితే వీలైనంత స్కిన్ షోతో కిక్ ఇస్తారు. మరి అల్ట్రా గ్లామరస్ ముంబైలో నెగ్గుకు రావాలంటే మడి కట్టుకుని కూర్చోవటం కుదరదు కదా! అందుకే, మన సౌత్ బ్యూటీస్ కూడా ముంబైకి బయలుదేరితే వార్డ్ రోబ్ ని రీడైజన్ చేసుకుంటారు. ఇక్కడి కంటే అక్కడ కొంచెం ఎక్కువే ఆవిర్లు పట్టిస్తుంటారు. తాజాగా రశ్మిక మందణ్ణ కూడా అదే ప్రయత్నం చేస్తోంది! కన్నడ సినిమాలతో పయనం మొదలు పెట్టిన రశ్మిక శాండల్ వుడ్ లో ‘కర్ణాటక క్రష్’ అనిపించుకుంది. తెలుగు, తమిళం పూర్తి చేసుకుని ప్రస్తుతం హిందీ తెర మీద దృష్టి పెట్టిన బెంగుళూరు భామ ఇప్పుడు ‘నేషనల్ క్రష్’గా రచ్చ చేస్తోంది. ఇంకా ఆమె నటించిన తొలి చిత్రం ‘మజ్నూ’ రిలీజ్ కాకుండానే పరిశ్రమలో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. అందుక్కారణం, ‘భీష్మ’ బ్యూటీ సరికొత్త లుక్సే!
తెలుగులో ‘పుష్ప’ లాంటి క్రేజీ మూవీ చేస్తోన్న రశ్మిక హిందీలో ‘మజ్నూ, గుడ్ బై’ అంటూ రెండు సినిమాలు చేస్తోంది. అయితే, ఆమె రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్స్ తో హల్ చల్ చేస్తూనే ఉంది. పైగా రానురాను రియల్ ‘బాలీవుడ్ బేబ్’ మాదిరిగా గ్లామర్ డోస్ పెంచుతోంది కూడా! తాజాగా ఆమె వదిలిన హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అమాంతం వైరల్ అయ్యాయి. కొంచెం కూడా ట్రెడిషనల్ టచ్ లేకుండా ఫుల్ మోడర్న్ లుక్ తో రశ్మిక బీ-టౌన్ టాప్ బ్యూటీస్ కి గట్టి సవాలునే విసిరింది. చూడాలి మరి, బాలీవుడ్ బేబీగా మారిన ‘భీష్మ’ బ్యూటీ ముంబైలో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో!

Related posts