telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.  ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని వర్గాలకు పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. గర్భిణీ మహిళలు, వికలాంగ ఉద్యోగులకు పూర్తిగా ఇంటి నుంచే పని చేసే అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ-డీఓపిటి ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ లో నివసించే ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించింది. కార్యాలయంలో విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.

Related posts