telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేశ్ సరసన ఇస్మార్ట్ భామ ?

Nidhi-Agarwal

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మళ్లీ వీరిద్దరి సినిమా ఎప్పుడు వస్తుందా? అని సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా  ‘ఇస్మార్ట్ శంకర్’తో లైన్లోకి వచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఏదీ చేయక పోయినా సోషల్ మీడియాలో గ్లామర్ తో రచ్చ చేస్తూ వస్తోందీ అమ్మడు. ఇదిలా ఉంటే మహేశ్, త్రివిక్రమ్ కలయిలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. ఇందులో హీరోయిన్ గా పూజా హేగ్డే పేరు వినిపిస్తోంది. కానీ అమ్మడు పలు చిత్రాలతో బిజీగా ఉంది. దాంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నరని టాక్. అందులో నిధి అగర్వాల్ కూడా ఉందట. కానీ నిధి అగర్వాల్ లీడ్ రోల్ కి కాదు సెకండ్ లీడ్ కోసం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అదే నిజమైతే నిధి కెరీర్ కి చక్కటి బ్రేక్ లభించినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో!?

Related posts