telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు

నవంబర్ 2, సోమవారం దినఫలాలు: రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి పురోభివృద్ధి

మేషం: ఈ రాశిలోని పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతుంది. వాతావరణంలో మార్పు తోటల రంగాల వారికి ఆందోళన కలిగిస్తుంది. సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. 

వృషభం: ఈ రాశిలోని పత్రిక, ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 

మిథునం: మీరు ప్రముఖుల కలయిక వాయిదా పడటంతో నిరుత్సాహానికి గురవుతారు. మందులు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 

కర్కాటకం: మీకు వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. మీ ప్రియతముల పట్ల, ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థినుల మొండితనం అనర్ధాలకు దారితీస్తుంది. సోదరీ సోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు.

సింహం: ఈ రాశిలోనివారు ఆర్థిక సమస్య వల్ల ఒకింత ఆందోళనకు గురవుతారు. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి రాగలవు. కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 

కన్య: ఈ రాశిలోని రాజకీయాల్లో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఉపాధ్యాయులు పై అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ సంతానం కోసం ధనం వ్యయం చేయాల్సి వస్తుంది.

తుల: ఈ రాశిలోని కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకుంటారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయవద్దు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విదేశీ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశిలోని కంప్యూటర్, టెక్నికల్, ఐటీ రంగాల్లో వారికి సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నూతన పరిచయాలేర్పడతాయి. 

ధనస్సు: ఈ రాశిలోని విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అధికశ్రమ, పనిభారం అధికం కాగలదు. ట్రాన్స్‌పోర్ట్, ఆటో మొబైల్, రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.

మకరం: మీరు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెళకువ వహించడం మంచిది.. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, 

కుంభం: మీరు వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య విభేదాలు తొలగి సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. 

మీనం: మీరు సాంఘిక, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి పనిభారం అధికమవుతుంది.

Related posts