telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

98 ఏళ్ళ వయసులోనూ … స్కై డైవింగ్‌ చేసిన .. రైస్‌ ..

rice sky diving at 98 years old

జీవితాన్ని కొందరు ఆస్వాదిస్తూ.. వయసును మరిసిపోతుంటారు. ఇంకొందరు నిరాశానిస్పృహలమధ్య కొట్టుమిట్టాడుతూ.. లేత వయసులోనే ముసలివాళ్ళలా నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోతుంటారు. అమెరికాకు చెందిన రైస్‌ మొదటి కోవకు చెందినవాడు, ఎందుంటే ఆయనకు 98 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ హాయిగా స్కై డైవింగ్‌ చేసేస్తున్నారు. తాజాగా ఆయన నెదర్లాండ్స్‌లోని గ్రోస్‌ బీక్‌ ప్రాంతంలో ఒక విమానం ద్వారా 42.4 మీటర్లు స్కై డైవింగ్‌ చేశారు. జన్మత అమెరికా పౌరుడైన రైస్‌ 1939-45 కాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు.

ఫ్రాన్స్‌లో శత్రువులు, అక్రమించుకున్న భూభాగాన్ని విముక్తం చేసేందుకు జరిగిన పోరాటంలో ఆయన వీరోచితంగా పోరాడారు. ఈ ఘటనకు 75 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో కైల్‌ రైస్‌ మరొక సారి స్కై డైవింగ్‌ చేశారు. అన్నట్లు తనకు నూరేళ్లు వచ్చే వరకు స్కై డైవింగ్‌ చేస్తూనే ఉంటానని కైల్‌ రైస్‌ ప్రకటించడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Related posts