telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పోక్సో చట్టం సవరణ బిల్లుకు .. ఆమోదం .. ఇక కఠిన శిక్షలే..

pocso act modifications accepted in parliament

అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టం సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ తరహా నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడం వంటివి ఈ బిల్లులో ప్రతిపాదించారు. రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదానికి వెళ్లనుంది. చైల్డ్‌ పోర్నోగ్రఫీని అరికట్టేందుకు జరిమానా, జైలు శిక్ష వంటివి కూడా ఈ బిల్లులో ఉన్నాయి.

పిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలను అదుపులోకి తెచ్చేందుకు గానూ ఈ చట్టాన్ని సవరించేందుకు ఈ నెల మొదట్లో జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ప్రభుత్వానికి సంపూర్ణ బలం ఉన్నందున ఈ బిల్లు చట్టరూపం దాల్చడం లాంఛనం కానుంది.

Related posts