telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

ఐపీఎల్ ను ఇలా కూడా ఉపయోగిస్తున్న హైదరాబాద్ పోలీసులు…

ఐపీఎల్ వీడియోను ఉపయోగించి హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ విషయంలో కొన్ని సినిమా సీన్స్ ని, కొన్ని మీమ్స్ ని వాడుతూ ఎంటర్టైన్ చేసే ఎలా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు తాజాగా నిన్న ఐపీఎల్ లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ తో హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ తో తలపడగా ముంబైపై ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నెగ్గి ప్లే ఆఫ్ కి చేరుకుంది. అయితే నిన్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో దవాల్ కులకర్ణి తలకి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ చివరి బాల్ జాసన్ హోల్డర్ వేయగా దాని కులకర్ణి గట్టిగా హిట్ ఇచ్చాడు. ఆ బాల్ బౌండరీకి వెళ్లినా ఒక రెండు రన్స్ తీయచ్చు కదా అని ట్రై చేశారు. ఈ క్రమంలో ఫీల్డర్ బాల్ వికెట్ కీపర్ గా అందించడానికి చూడగా అది అనుకోకుండా కులకర్ణి తలకు తగిలింది. దీన్ని ఉదహరిస్తూ సైబరాబాద్ పోలీసులు ఆ వీడియోని తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. షేర్ చేసి “ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు హెల్మెట్ ధరించండి క్షేమంగా ఉండండి అది ఆట అయినా రోడ్డు అయినా” అంటూ తెలిపారు. 

Related posts