telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మరో కొత్త వ్యవస్థను స్థాపించిన ఏపీ సీఎం…

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ… దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థలో ఉంటాయని అన్నారు. భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం కూడా కల్పిస్తున్నామని అన్నారు. క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ మొదలు పెడతామని ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ ప్రవేశ పెడతామని అన్నారు. ఇక క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అన్నవరం టెంపుల్‌కు 10,116లు ఇ–హుండీ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వాళ్ళు సమర్పించారు. దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు.

Related posts