telugu navyamedia
క్రీడలు వార్తలు

మనకు ఆ పద్ధతి పనికి రాదు : లక్ష్మణ్

vvs lakshman on bangladesh-india series

భారత క్రికెట్‌కు ఫార్మటు ఓ కెప్టెన్ సెట్ కారు అని, ఆ వాదనలో అర్థం లేదని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అజింక్యా రహానే జట్టును విజయపథంలో నడిపించిన విషయం తెలిసిందే. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అతన్ని పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. అలాగే గతంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించాలనే వాదనలూ వినిపించాయి. సమయం వచ్చినప్పుడల్లా, భారత జట్టు ఓడినప్పుడల్లా కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయం పై స్పందించిన లక్ష్మణ్… భారత జట్టుకు ఫార్మాట్లను బట్టి కెప్టెన్లను కుదరదని స్పష్టం చేశాడు. ‘విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలను భారంగా భావించనంతవరకూ.. మూడు ఫార్మాట్లలో బాగా ఆడుతుంటే అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలి.. ఎవరైనా ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలి. ఈ విషయంలో టీమిండియాను ఇంగ్లాండ్‌తో పోల్చలేం. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీని కాదని వేరొకరిని కెప్టెన్‌గా చేయాల్సిన అవసరం లేదు.’అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

Related posts