telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సిబిఐ వస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు పోతారు..

Devineni-uma

రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ.. రాజధాని జేఏసీ ఆందోళనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వరకు తెదేపా శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శనను నిర్వహించి వినతిపత్రాన్ని దేవినేని ఉమా అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
33 వేల ఎకరాల పొలం ఇచ్చిన రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ? ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిన రైతులు మొక్కవోని దీక్షతో 318 రోజులుగా అమరావతి ఉద్యమం ముందుకు సాగిస్తున్నారు. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన రైతులపై మహిళలపై రైతు కూలీలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెంటుపట్టా భూ కుంభకోణాలు ఇవన్నీ కోర్టుల్లో ఉన్నాయి.. సిబిఐ వస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు పోతారు ఆ 40 మంది ఎమ్మెల్యేలలో మైలవరం ఆర్థిక నేరగాడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. ఆవ భూముల్లో వందల కోట్ల దోపిడీ జరిగిందని మీ వైసీపీ పార్టీ నాయకులు హైకోర్టులో సి బి ఐ ఎంక్వయిరీ కేసు వేశారని.. సెంటు పట్టా పథకం కింద కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను కొట్టేసి కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. వాహనాలు సీజ్ అయ్యాయి, అధికారులు సస్పెండ్ అయ్యారు, 10లక్షల పెనాల్టీ నీ బావమరిది కట్టాడా ? నువ్వు కట్టావా ? అంటే సమాధానం చెప్పకుండా పారిపోయారని మండిపడ్డారు. షాబాద్ కొండలను కొట్టేశారు, జక్కంపూడి కొండలను కొట్టేశారు తెదేపా ప్రభుత్వ హయాంలో 8500 ఇల్లు కడితే ఆ ఇంటి పునాదులు కదిలేవిధంగా నువ్వు, నీ బావమరిది ఆధ్వర్యంలో కొండలను కొట్టేసి మాట్లాడానంటే ఎలా ? సమాధానం చెప్పకుండా ఎన్నిరోజులు తప్పించుకుంటారు ? అని ప్రశ్నించారు.a

Related posts