ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలని ఆదేశిస్తూ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై టీడీపీ యనమల రామకృష్ణుడు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ ఆదేశించడం సంతోషకరమని అన్నారు.
భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ న్యాయ విభాగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందన్నారు. ఎస్ఈసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటినుంచైనా నిబంధనలకు అనుగుణంగా జగన్ ప్రవర్తించాలని హితవు పలికారు.
ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…