telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా..? : ఏపీ హైకోర్ట్

ap high court

మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై ఏపీ హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. అయితే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా..? అని హైకోర్ట్ ధర్మాసనం ప్రశ్నించింది. ఆస్తులమ్మీ నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా..? అని ప్రభుత్వాన్ని హైకోర్ట్ అడిగింది. కరోనా సమయంలో అత్యధిక ధరకు మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడిన మందుబాబులకు ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని వ్యగ్యంగా వ్యాఖ్యానించింది ధర్మాసనం. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం చేస్తుంది అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. మీరెంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసని ధర్మాసనం తెలిపింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ఆస్తుల అమ్మకాన్ని నివారించాలని హైకోర్ట్ లో 10 పిటిషన్లు దాఖలు అయ్యాయి. కౌంటర్లు అందరికీ అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. డిసెంబర్ 17వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది. మిషన్ బిల్డ్ ఏపీలో ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసారు గుంటూర్ కు చెందిన సామాజిక కార్యకర్త సురేష్. అతని తరపున హైకోర్ట్ లో న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

Related posts