పాలనా సౌలభ్యం కోసం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలుగా కలిసి ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో చర్చించుకోవడం వాంఛనీయ పరిణామమని అన్నారు.
చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి యత్నించడం అభినందనీయమన్నారు. కేంద్రం జోక్యం లేకుండా పరిష్కరించుకోగలిగితే ఇంకా మంచిదని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఇదే ఆకాంక్షను వ్యక్తం చేశానని తెలిపారు. కారణం ఏదైనా అని కార్యరూపం దాల్చలేదు. గవర్నర్ సమక్షంలో జగన్, కేసీఆర్ చర్చించుకోవడం అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే ఇసుక సమస్య: కన్నా