telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్యాసెంజర్ పైలెట్ గా మారాడు… ఆ తరువాత ఏం జరిగిందంటే…?

jet

సోమవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి స్పెయిన్‌లోని అలికాంట్‌కు వెళ్లాల్సిన విమానం రెండు గంటలు డిలే అయింది. ఎందుకంటూ ప్రయాణికులు ప్రశ్నించగా.. పైలట్ అందుబాటులో లేడంటూ సమాధానమిచ్చారు. ఈజీజెట్ ఎయిర్‌లైన్స్‌కు పైలట్ కొరత ఉండటంతో రెండు గంటలు గడిచినా ఒక్క పైలట్ కూడా దొరకలేదు. ఇక చేసేదేం లేక మైకెల్ బ్రాడ్లీ అనే ఓ ప్యాసెంజర్ తాను విమానం నడుపుతానంటూ ముందుకొచ్చాడు. అవ్వడానికి ప్యాసెంజర్ అయినప్పటికీ.. నిజానికి మైకెల్ ఓ పైలట్. అందులోనూ అదే ఈజీజెట్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నాడు. మైకెల్ ప్రస్తుతం లీవ్‌లో ఉన్నాడు. కుటుంబంతో కలిసి వెకేషన్‌కని బయలుదేరాడు. ఇంతలో ఇలాంటి సమస్య రావడంతో.. తాను పనిచేస్తున్న కంపెనీ కోసం ఇలా పైలట్‌గా మారాలనుకున్నాడు. ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ఫోన్ చేసి తాను నడుపుతానని, తన లైసెన్స్ కూడా వెంటే ఉందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన 38 సెకన్లకు తిరిగి మైకెల్‌కు ఫోన్ చేసిన ఎయిర్‌లైన్స్ అధికారులు ఆయనకు అనుమతినిచ్చారు. అలా మొదటిసారిగా ఓ ప్యాసెంజర్ పైలట్‌గా మారడాన్ని చూశామంటూ విమానంలో ప్రయాణించిన ఓ యువతి తన ఫేస్‌బుక్ ఖాతాలో చెప్పుకొచ్చింది. తాము మొదటిసారి ఓ పైలట్ కెప్టెన్ యూనిఫాం లేకుండా విమానాన్ని నడపడం చూశానంటూ ప్రయాణికులందరూ ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మైకేల్ ఇలా చేయడం తమకు కూడా సంతోషంగా ఉందని భార్య, కొడుకు కూడా తెలిపారు.

Related posts