మంగళవారం దక్షిణ చికాగోలోని ఏవియరీ బార్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కొడుకు ఎరిక్ ట్రంప్ బిజినెస్ డిన్నర్‌కు వెళ్లారు. అక్కడ ఎరిక్ ట్రంప్‌పై ఓ యువతి ఉమ్మేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఓ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఎరిక్ ట్రంప్ భావోద్వేగ సమస్యలతో ఉన్న యువతి చేసిన అసహ్యకరమైన చర్య ఇది అని ఓ ప్రతికకు తెలిపారు. యువతి గురించి ఎరిక్ గానీ, ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గానీ ఎటువంటి విషయాలు వెల్లడించలేదు. చికాగో పోలీసులు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు యువతిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే యువతిపై కేసు పెట్టడానికి ఎరిక్ ట్రంప్ నిరాకరించినట్టు వార్తలొస్తున్నాయి. బార్ యాజమాన్యం మాత్రం యువతి ప్రస్తుతం సెలవులో ఉన్నట్టు ప్రకటించింది. అసలు ఆ యువతీ ఎందుకలా చేసింది ? ఆ యువతి ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.
previous post