telugu navyamedia
వార్తలు సామాజిక

టోల్ గేట్ లలో ఇచ్చే రసీదుతో ఎన్ని సౌకర్యాలో..!

toll gate receipt

టోల్ గేట్ లలో ఇచ్చే రసీదుతో ఎన్నో సౌకర్యాలున్నప్పటికీ చాలా మందికి తెలియక రసీదులను లైట్ గా తీసుకొని పారవేయడం చేస్తుంటారు.మీరు జాతీయ రహదారి లో వెళ్తున్నప్పుడు మీకు అనుకోకుండా ఆరోగ్య సమస్య ఎదురైతే టోల్ గేట్ రసీదు వెనుక వున్న నెంబర్ కి కాల్ చేస్తే 10 నిమిషాలలో మీ వద్దకు అంబులెన్స్ వస్తుంది. అలాగే మీ యొక్క వాహణం టైరు పంచర్ కావటం,లేదా ఆగిపోవటం జరిగినట్లైతే కాల్ చేసిన 10 ని.లలో మీకు సహాయం అందుతుంది.

అంతేకాకుండా మీ వాహనం లో పెట్రోల్,డీజిల్ అయిపోయి నట్లయితే వారు 5 లేదా 10 లీ. పెట్రోల్/డీజిల్ తెస్తారు అందుకు డబ్బులు చెల్లించాలి. ఈ సదుపాయలన్ని మనం కట్టే టోల్ గేట్ ఛార్జీలలో వర్తిస్తుంది.ఈ విషయాలు తెలువక చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. టోల్ గేట్ లలో ఇచ్చే రసీదుతో ఇన్ని సౌకర్యాలున్న వినియోగించుకునేవారు చాలా తక్కువేనని తెలుస్తోంది.

Related posts