telugu navyamedia
రాజకీయ వార్తలు

ఇక నుండి కరోనా హాస్పిటల్స్ లో మానసిక వైద్యులు…

masks corona

కరోనా విషయంలో ప్రజలకు ఉన్న భయం ఇప్పుడు కాస్త తగ్గింది కానీ మొదట్లో ఒక వీధిలో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే పక్క వీధిలో వాళ్లు కూడా గడగడలాడే వారు. సరిగ్గా పది రోజులు చికిత్స తీసుకుంటే కరోనాను జయించి, మళ్లీ మనుపటి మనిషిలా చురుగ్గా మారే అవకాశం ఉంది. అయితే కావాల్సిందల్లా మనో నిబ్బరం. ఆ మనో నిబ్బరం చాలా మందికి కోరవడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కోవిడ్ ఆసుపత్రుల్లో మానసిక వైద్యులుండాలని చెబుతూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా సోకినా కొదరిలో మానసికంగా ఆందోళన చెందుతున్నారని కేంద్రం భావిస్తోంది. ఇక కేంద్రం తాజాగా దీనిపై నిన్న ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ ఆస్పత్రుల్లో మానసిక వైద్యం కన్సల్టేషన్‌ ను కేంద్ర ఆరోగ్యశాఖ  అందుబాటులోకి తీసుకురానుంది. కరోనా నేపథ్యంలో మానసిక కుంగుబాటు, పోస్ట్‌ – ట్రామటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎ్‌సడీ), దీర్ఘకాలిక మానసిక రుగ్మతలు కలిగినవారు, తీవ్ర మానసిక ఆందోళనకు లోనయ్యే వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని కేంద్రం అనుకుంటుంది.  

Related posts