telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

యూఎస్ కు క్రిస్మస్, న్యూఇయర్ గండం…

New-Year

చైనా నుండి వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. అందులో అగ్రరాజ్యంగా పేరు గాంచిన అమెరికా కూడా ఉంది. అక్కడ రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  మరణాలు కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  నిన్నటి రోజున రికార్డ్ స్థాయిలో 3124 మరణాలు సంభవించాయి.  ఇటీవలే జరిగిన థాంక్స్ గివింగ్ వేడుకల కోసం అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.  ఈ వేడుక తరువాత పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.  మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నది.  ఈ సమయంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అమెరికాలో క్రిస్మన్, న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు.  ఈ ఏడాది క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు ప్రజలు దూరంగా ఉండాలని, కనీసం మూడు నుంచి ఆరువారాల పాటు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలు, సామూహాలుగా చేరడం వంటివి కొంతమేర తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts