telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ .. సరికొత్త రికార్డు.. జడేజా ను దాటేశాడు..

nil warner crossed jadeja record

భారత ఆటగాడు రవీంద్ర జడేజా తరువాత టెస్టుల్లో అతి తక్కువ మ్యాచ్ ల్లో 200 వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్ గా రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్. ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న రెండో టెస్టు లో వాగ్నర్ రెండో ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు. అతినికిది 46వ టెస్టు మ్యాచ్. కాగా జడేజా 44 మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని వేగంగా చేరుకున్న రెండో న్యూజిలాండ్ బౌలర్ గా వాగ్నర్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు రిచర్డ్ హాడ్లీ 44మ్యాచ్ ల్లో 200 వికెట్లు తీసి ఈజాబితాలో మొదటి స్థానం లో వున్నాడు.

ఓవరాల్ గా 36మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించి మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు భారత జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇదిలా ఉంటే రెండో టెస్టు లో న్యూజిలాండ్ కు ఓటమి తప్పేలా లేదు. మొదటి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 148పరుగులకే కుప్పకూలింది. తరువాత రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ మూడో రోజు అట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 137పరుగులు చేసింది. దాంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 456పరుగుల ఆధిక్యంలో వుంది. ఇంకా రెండు రోజుల అట మిగిలివున్నందున న్యూజిలాండ్ ఓటమి తప్పదన్నట్టే.

Related posts