telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రెండో డోసు వ్యాక్సినేష‌న్ నిలిపేసిన తెలంగాణ సర్కార్….

Corona Virus Vaccine

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన వ్యాక్సిన్ కొరత కారణంగా అది ఇంకా పూర్తి కాలేదు. అయితే మన తెలంగాణ‌లో కరోనా వ్యాక్సిన్ కొరతా ఉన్న విషయం తెలిసిందే అదే ప‌రిస్థితి.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈరోజు కోవాగ్జిన్ రెండో డోసు వ్యాక్సినేష‌న్ నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ నిలిపేస్తూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ ఎప్పుడ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. కాగా, ఈ నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందిరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించినా.. వ్యాక్సిన్ల కొర‌త‌తో అది పూర్తిస్థాయిలో సాధ్యం కాలేదు.. ఈ స‌మ‌యంలో.. రెండో డోసుల‌కు ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది స‌ర్కార్. కానీ, ఇప్పుడు వ్యాక్సిన్ల కొర‌త కార‌ణంగా.. రెండో డోసు వ్యాక్సినేష‌న్‌ను కూడా నిలిపివేసింది. చూడాలి మరి మళ్ళీ ఎప్పుడు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు అనేది.

Related posts