telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎంత మంచివాడవురా : ఓ చిన్న నవ్వే చాలు… లిరికల్ వీడియో సాంగ్

EM

నందమూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత‌మంచివాడ‌వురా`. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ త‌న 17వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న విడుద‌ల కానుంది . మెహరీన్ కథానాయికగా నటించింది. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా చిత్రం నుండి “ఓ చిన్న న‌వ్వే చాలు” లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. గీతా మాధురి పాడిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. మీరు ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts