telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూగుల్ మ్యాప్స్‌ కారణంగా వీడిన 22 ఏళ్ల మిస్టరీ…!?

Google

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్‌లో తమ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాడు. ఇంతలో పక్కింటి వెనకున్న కొలనులో అతనికో వింత కనిపించింది. దాన్ని కొంచెం జూమ్ చేసి చూసి షాకయ్యాడు. వెంటనే ఆ ఇంటి యజమానికి విషయం చెప్పాడు. ఇంతకీ ఏంటంటే.. బ్యారీ ఫే అనే వ్యక్తి ఇంటి వెనుక ఓ కొలనుంది. దానిలో ఓ కారు మునిగిపోయి ఉంది. ఈ విషయం పక్కింటి మిత్రుడి ద్వారా తెలుసుకున్న బ్యారీ వెంటనే పోలీసులకు తెలియజేశాడు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. కొలను లోంచి కారును బయటకు తీయించారు. కారు తలుపులు తెరిచారు. అంతే వారి నోటమాట రాలేదు. ఎందుకంటే ఆ కారు డ్రైవర్ సీట్లో ఓ వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉంది. దీంతో అవాక్కయిన పోలీసులు ఆ కంకాళం ఎవరిదని ఆరా తీశారు. పాత కేసులన్నీ తిరగదోడారు. చివరకు ఆ కంకాళం 22 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ విలియం ఎర్ల్ మోల్డ్‌దని తేలింది. 1997లో అతను కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎంత గాలించిన వారికి విలియం జాడ తెలియలేదు. దీంతో ఆ కేసు అన్నేళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఈ మిస్టరీ వీడింది.

Related posts