telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పొట్ట కొడుతున్నారు: పొన్నాల

ponnala lakhmaih

తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న మంత్రివర్గం నిర్ణయంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యాభైవేల మంది కార్మిక కుటుంబాల పొట్టకొట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.

టీఎస్‌ఆర్‌టీసీ ఆస్తులను, సంపదను కొల్లగొట్టే దోపిడీ వ్యూహంలో భాగమే ప్రభుత్వం చేసిన ప్రైవేటీకరణ సూత్రమనివిమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయక పోవడంలోనే ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు.

ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీకి, ఇప్పుడు చేసిన ప్రకటనకు పొంతనలేదని ధ్వజమెత్తారు. సమ్మె కారణంగా రోజుకి కోటి మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమ్మె సమస్యను పరిష్కరించాల్సింది పోయి కార్మికులను బెదిరించడం, బ్లాక్‌ మెయిల్‌ చేయడం కేసీఆర్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. తమది పారదర్శక ప్రభుత్వమని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. కార్మికులతో నేరుగా చర్చలు జరపడానికి సమస్య ఏమిటని ప్రశ్నించారు.

Related posts