telugu navyamedia
తెలుగు కవిత్వం వార్తలు

చెరువుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నగరం లో 346 కోట్ల తో చెరువుల అభివృద్ధి -మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి
జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ చెరువు వద్ద ఘనంగా ఊరు రా చెరువుల పండుగ
ఊరు రా చెరువుల పండుగలో లోటస్ పాండ్ చెరువు వద్ద బతుకమ్మ ఆడి పాడి, మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

చెరువుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఊరు రా చెరువుల పండుగ ను గురువారం ఖైరతాబాద్ జోన్ జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ చెరువు వద్ద రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… 2014 సంవత్సరానికి ముందు చెరువులు కబ్జా, నిరాదరణకు గురయ్యాయని వాటిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 2023 సంవత్సరం వరకు తొమ్మిదేళ్లలో చెరువుల పూడికతీత, పునరుద్దరణ కార్యక్రమాలు జరిపి త్రాగు, సాగునీరు అందిస్తోందని తెలిపారు. జిహెచ్ఎంసిలో ఉన్న 185 చెరువుల పరిరక్షణకు జిహెచ్ఎంసి, హెచ్.ఎం.డి.ఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 46,623 చెరువులు ఉండేవని, కాలక్రమంలో ధ్వంసమయ్యాయి తెలిపారు. మానవ మనుగడకు నీరు, కరెంట్ ప్రధానమైనదని, వీటిని తెలంగాణ రాష్ట్రం నిరంతరాయంగా అందిస్తోందని తెలిపారు. గతంలో రైతులు నీరు లేక బాధపడేవారని, నేడు చెరువులు జలకళ ను సంతరించుకున్నాయని తెలిపారు.

చెరువులలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా 50 సంవత్సరాలకు సరిపడా నీరు నిల్వ ఉందని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.  చెరువులు నిండటం ద్వారా మత్య్సకారులకు, కుల వృత్తులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి హెచ్ ఎం సి లో   సిమెంట్ రోడ్లు, ఎల్.ఇ.డి లైట్లు, శాంతి భద్రతలకు కమాండ్ కంట్రోల్, పార్కుల అభివృద్ది, చెరువులలో ప్రజలకు సేద తీరడానికి వాకింగ్ ట్రాక్, బెంచీలు, ఓపెన్ జిమ్స్, టాయిలెట్లు, లైటింగ్ సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఊరురా చెరువుల పండుగ బుక్ లేట్ ను  మంత్రి  ఆవిష్కరించారు.

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగను  నియోజక వర్గ స్థాయిలో పెద్ద యెత్తున పంగుడ  వాతావరణం ప్రతిబింబించేలా  ప్రజల భాగస్వామ్యం తో జరుపుకుంటున్నమన్నారు  తెలంగాణ ఏర్పడక ముందు నగరం లో  చెరువులు ఆక్రమణలతో, దుర్గంద భరితంగా ఉండేవని,  తెలంగాణ ఏర్పాటయ్యాక చెరువులను గుర్తించి చెరువుల పూడికతీత, పునరుద్దరణ, సుందరీకరణ కు రూ.345.81 కోట్ల అంచనా వ్యయం తో 355 పనులు చేపట్టి నట్లు  అందులో ఇప్పటి వరకు 191 పనులు పూర్తి కాగా మరో 144 పనులు ప్రగతి దశ లో ఉన్నాయని మేయర్  తెలిపారు.
నగరం లో చెరువుల ను అన్యాక్రాంతం కాకుండా  కూడా చర్య తీసుకున్నట్లు   రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నిర్మాణ సంస్థలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద  నగరం లో ఇప్పటి వరకు 36 చెరువులను దత్తత తీసుకొని ఒక్కో చెరువుకు కోటి నుండి రూ. 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ జోన్ షేక్ పేట్ షికారి కుంట, కొత్త కుంట, బాతూర్ కుంట, వట్టి కుంట చెరువుల పునరుద్దరణ కు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఊరురా చెరువుల పండుగలో భాగంగా మహిళలతో కలిసి నగర మేయర్ బతుకమ్మ ఆడి గంగమ్మ తల్లికి సమర్పించి మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు చెరువుల పటిష్టత స్లూస్ మత్తడి మరమ్మత్తులు మురుగు నీటి మళ్లింపు పనులకు వలన లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు వరద ముంపు నిరోధానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
. స్థానిక శాసన సభ్యులు దానం నాగేందర్ మాట్లాడుతూ… చెరువుల పునరుద్దరణ ద్వారా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమిషనర్లు రజనీకాంత్, మోహన్ రెడ్డి, జిహెచ్ఎంసి లేక్స్ సి.ఇ సురేష్, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీత యాదవ్, వెంకటేష్, ఆర్.డి.ఓ వసంత, ఇరిగేషన్ సి.ఇ ధర్మ, ఎస్.ఇ ఆనంద్, ఇ.ఇ శంకర్ రావు, డి.ఇ.ఇ శశికళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, మత్స్య శాఖ అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts