telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భద్రాద్రి లో .. ముక్కోటి శోభ …

vaikunta yekadasi utsav in badradri

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ముక్కోటి శోభతో అలరారుతోంది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీరామచంద్రస్వామివారు శ్రీకృష్ణ అవతారంలో కనిపించారు. భక్తులకు దర్శనమిచ్చారు. ఆ రూపాన్ని చూసి… భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. భక్తుల భజనలు, కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య భారీ ఊరేగింపుగా స్వామిని మిథిలాస్టేడియం దగరున్న అధ్యయనోత్సవ వేదిక చెంతకు తీసుకెళ్లారు. అక్కడున్న భక్తులు కూడా స్వామిని దర్శించుకొని ఫుల్ ఖుషీ అయిపోయారు. తర్వాత తిరువీధి సేవ బాగా జరిగింది.

నేడు తెప్పోత్సవం నిర్వహించబోతున్నారు. ఇందుకోసం గోదావరి తీరాన్ని అదిరిపోయేలా డెకరేట్ చేశారు. అది చూసేందుకు ఆల్రెడీ భక్తులు బోలెడు మంది ముందే అక్కడకు వచ్చి ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో శ్రీరామంచంద్రస్వామి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. స్వామిని అలా చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటూ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రాబోతున్నట్లు తెలిసింది.

Related posts