telugu navyamedia
Bhakti

ధర్మానికి ప్రతిరూపం నందీశ్వరుడు…!!

కైలాసనాధుని ప్రమద గణాలలో అతి ముఖ్యుడు నందీశ్వరుడు.

ఈ నందీశ్వరునికి అనేక రూపాలు. ఐదుగురు నందీశ్వరులను ఆగమాలు వివరిస్తున్నాయి. ఆవిధంగా మన ఆలయాలలో

ధర్మనంది, విష్ణునంది,
అధికారనంది, సామాన్యనంది, మహానందిగా శివుని సన్నిధిలో దర్శనమిస్తారు.

ఇవే కాకుండా
కొన్ని ఆలయాలలో అమ్మవారి సన్నిధిలో కూడా నందీశ్వరుడు వుంటాడు.

ఆ నందీశ్వరుని సోమనంది అంటారు.
ఇంకా భోగనంది, ఆత్మనంది, బ్రహ్మనంది కైలాసనంది
మొదలైన నందులు కూడా ప్రతిష్టించబడివుండడం గమనిస్తాము.

పరమశివుని శిష్యుడు…
నంది అంటేనే ఆనందం,
జ్ఞానం, సంతోషాన్ని
యిచ్చేవాడని అర్ధం.

నందీశ్వరుని ఆరాధన అన్నివిధాల శుభకరం.నంది పరమేశ్వరుని ప్రధమ శిష్యుడు. పరమశివుని
ఎనిమిదిమంది దళపతుల‌లో
ఒకడు. నాద శైవ అష్ట శిష్యులలో ఒకరుగా పురాణాలు వివరిస్తున్నాయి.

ఉన్నత పదవి కావాలా..
శివాలయాలలో ఈశ్వరుని దర్శించడానికి అనుమతించే అధికారము , శివునికి జరిగే పూజలు, అభిషేకాలు పర్యవేక్షించే అధికారము కలిగినవాడు అధికారనంది.

ఆలయ ప్రవేశంలో ధ్వజస్ధంభం వద్ద వుండే అధికారనందిని పూజించి అనుగ్రహం పొందితే
ఉన్నత పదవులు లభిస్తాయి.

నందీశ్వరుడు పురాణం చెప్పే రహస్యం..

గర్భగుడిలోని ఈశ్వరునికి ఎదురుగా
బయటవుండే నందిని ధర్మనంది అంటారు. నందికి అడ్డంగా వెళ్ళ కూడదు.

నందియొక్క ఉఛ్వాస నిశ్వాసాలు సదా ఈశ్వరుని
మీద పడతాయని ఐహీకం. నంది వేరు తాను వేరు కాదని ఇద్దరమూ ఒకటే అని
మహేశ్వరుడు నంది పురాణంలో చెప్తున్నాడు.

నందీశ్వరుని పవిత్ర నామాలు..
వృషభుడు, రుద్రుడు,
శైలాది,మృదంగ ప్రియుడు,
శివప్రియుడు, కరుణా కరమూర్తి, వీరమూర్తి, ధనప్రియుడు, కనక ప్రియుడు అని అనేక నామాలతో నందీశ్వరుడు పిలవబడుతున్నాడు.

నందీశ్వరునిలో ఐక్యమయ్యే పవిత్ర తీర్ధాలు..

ప్రదోష కాలంలో అన్ని తీర్ధాలు నందీశ్వరునిలోనే
ఐక్యమవుతాయని ఐహీకం. అందుకే ఆరోజు నందీశ్వరుని పూజించడం శుభదాయకం.

ప్రదోషకాలంలో
నందికి గరికమాల , బియ్యం, బెల్లం, పళ్ళు కలిపిన నైవేద్యం పెట్టి పూజిస్తారు. ఇందువలన
సకల దోషాలు తొలగి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది.

 

Related posts