telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చలి వాతారవరణంలో కరోనా వ్యాపిస్తుందా..?

ప్రస్తుతం ఉన్న చలికి హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నదులు, కాలువల్లో నీరు గడ్డకట్టింది. ఢిల్లీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. మార్కెట్లను మూసి వేస్తున్నారు. కోవిడ్ 19 తో పాటు చలిగాలులు ఢిల్లీ ని వణికిస్తున్నాయి. దేశ రాజధానిలో 17 ఏళ్ల త‌ర్వాత నవంబ‌ర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత‌లు న‌మోద‌య్యాయి. ఆదివారం ఉద‌యం ఉష్ణోగ్రత 6.9 డిగ్రీల సెల్సియ‌స్‌కు పడిపోయింది. చివ‌రిసారి 2003 న‌వంబ‌ర్‌లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదైంది. చలిగాలులు పెరగడంతో కాలుష్యం కూడా పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 259గా న‌మోదైంది. హర్యానా, పంజాబ్‌లో గడ్డిని కాల్చవద్దని అధికారులు చెబుతున్నా.. కొంతమంది రైతులు పట్టించుకోవడం లేదు. గడ్డిని కాలుస్తూ ఉండటంతో.. ఆ పొగ అంతా ఢిల్లీ వైపు వస్తోంది. చలి గాలుల తీవ్రత, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం, మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీ ప్రజలు, ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. దీపావళి, చాత్‌ పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నారు.

Related posts