telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఇంటి గేట్‌కు తాళం..ఆహారం తీసుకెళ్లేందుకు అనుమతివ్వని పోలీసులు

chandrababu fire on AP CS again

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఈ రోజు పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. చంద్రబాబు ఇంటి మెయిన్ గేట్‌కు పోలీసులు తాళం వేశారు. చంద్రబాబును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఇంటి మెయిన్ గేట్‌కు తాళం వేసి, గేటును పెద్దపెద్ద తాళ్లతో కట్టేశారు. బయట నుంచి లోపలకి ఎవరినీ అనుమతించడం లేదు.

చంద్రబాబు ఇంట్లో ఉన్న నేతల కోసం ఆహారం, నీళ్లు ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతివ్వలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు లోపల ఉన్నారని ఆహారం తీసుకెళ్లేందుకు అనుమతించాలని నేతలు కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు ఇంట్లో పని చేసే వారిని కూడా పోలీసులు పంపించేశారు.ఈ ఘటనపనై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతి యుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

Related posts