telugu navyamedia
రాజకీయ వార్తలు

370 ఆర్టికల్‌ రద్దు విషయంలో బయట దేశాల జోక్యాన్ని అంగీకరించం: ఐరాసలో భారత్‌ ప్రతినిధి

unsc akbaruddin

జమ్మూకశ్మీర్ కు ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ రద్దు విషయంలో బయట దేశాల జోక్యాన్ని అంగీకరించేది లేదని ఐరాసలో భారత్‌ శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ తేల్చి చెప్పారు. 370 ఆర్టికల్‌ రద్దు విషయంలో ఎటువంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌పై నిన్న ఐక్యరాజ్య సమితి రహస్య భేటీ నేపథ్యంలో భారత్‌ తరపున ఆయన ఈ ప్రకటన చేశారు. అభివృద్ధికి దూరమై పేదరికంతో మగ్గిపోతున్న జమ్ముకశ్మీర్‌ ప్రజల కోసం నిర్ణయం తెస్సుకున్నామని తెలిపారు.

సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలన్న మంచి ఉద్దేశంతోనే జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణ రద్దు చేశామని తెలిపారు. ఈ నిర్ణయం విషయంలో ఐక్యరాజ్య సమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధిఈ అంశం విషయంలో బయట దేశాల జోక్యాన్ని కూడా అంగీకరించమని స్పష్టం చేశ్సారు. కశ్మీర్‌లో ఏదో జరిగిపోతోందన్న తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం కొందరు చేస్తున్నారన్నారు. కశ్మీర్‌పై ఆ దేశం ఎంత గగ్గోలు పెట్టినా నిరుపయోగమేనన్నారు. ఉగ్రవాదానికి స్వస్తిపలికితేనే పాకిస్థాన్‌తో చర్చలు కొనసాగుతాయని తేల్చిచెప్పారు.

Related posts