telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

వరద నష్టంపై ఏపీకి కేంద్రం బృందం…

floods in srilanka 79000 people lost everything

వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో కేంద్రం బృందం పర్యటించబోతోంది. దీంతో అంచనాలను సర్కార్‌ సిద్ధం చేస్తోంది. 186 మండలాల్లో వరద ప్రభావం ఉందంటోంది ప్రభుత్వం. దాదాపు 885 గ్రామాలు నీటమునిగినట్లు తేలింది. 35 వేల ఇళ్లు మునిగిపోగా… 1700కి పైగా ధ్వంసం అయ్యాయి. సుమారు 15 వందల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు అంచనా వేశారు. శాఖల వారీగా వివరాలు చూస్తే… ఆర్‌ అండ్‌ బీ శాఖకు 13 వందల కోట్లు.. ఇరిగేషన్‌కు 33 కోట్లు, మున్సిపల్‌ శాఖకు 23 కోట్లు, పంచాయతీ రాజ్‌కు 160 కోట్ల లెక్కన నష్టం జరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాగే మొత్తం రెండు లక్షల 38 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 34 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. విశాఖ, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో సుమారు 142 కోట్ల రూపాయల పట్ట నష్టం జరిగింది. ఆక్వా విషయానికి వస్తే గోదావరి జిల్లాల్లో 7 వేల 400 ఎకరాల్లోని ఆక్వా కల్చర్‌ సర్వ నాశనం అయింది. కాగా కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Related posts