నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్ రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఈ ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ తెలిపారు. అయితే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యలకు అధికారులు లేఖ రాశారు. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉండగా.. టీడీపీకి 18, వైసీపీ 16 స్థానాల్లో గెలిచింది. సీపీఐ ఒక స్థానంలో, ఇండిపెండెంట్ ఒక్క స్థానంలో గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ స్థానం కావాలంటే.. 19 మంది బలం ఉండాలి. ప్రస్తుతం టీడీపీకీ ఒక్కరు మాత్రమే కావాలి. సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ వారే అని అంటున్నా వైసీపీకి 16 స్థానాలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫీషియో ఓట్ల రూపంలో రెండు కలిసి వస్తాయి. అంటే వైసీపీకి కూడా కావాల్సింది ఒక్క సీటు మాత్రమే. అయితే ఏం అవుతుంది అనేది చూడాలి.
previous post
next post