ప్రపంచదేశాలన్నీ కరోనాతో ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన విద్యార్థులతో వీడియో క్లాసులో మాట్లాడుతూ…. భారత్ లోని ప్రజల్లో శారీరక వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని, కానీ వారిలో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువని అన్నారు. భారత్ లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి హాజరైన ప్రజల్లో ఎవరూ మాస్కులు ధరించి కనిపించకపోవడాన్ని వార్తల్లో చూసినట్టు తెలిపారు.
భారతీయులు మానసికంగా ఎంతో దృఢమైన వాళ్లు అన్న విషయం అప్పుడే అర్థమైంది. వారిది ప్రశాంత మనస్తత్వం. ఓవైపు అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతున్నా భారత్ లో అంత తీవ్రత కనిపించడంలేదన్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077 కాగా, మరణాల సంఖ్య 718కి పెరిగింది. భారత్ లోనూ కరోనా సామాజిక సంక్రమణం దశకు చేరుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నా, అది అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే ఏమంత ప్రమాదకరం కాదని జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు.
బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించారు: యనమల