నన్ను చంపేందుకే టీడీపీ కార్యకర్తలు మాఇంటి వద్దకు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఆరోపించారు. ఏపి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలమేరకు నన్ను హతమార్చేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. తన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు చేసిన ధర్నా పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాకినాడలో సీఎం చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటుచేసుకుంది.
రిటైర్ అయిన వారిని సీఎండీలుగా నియమిస్తున్నారు: రేవంత్