telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వర్ష ప్రభావిత కాలనీలపై మంత్రి కేటీఆర్ ఆరా..

ktr telangana

వర్ష ప్రభావిత కాలనీలను మూడోరోజు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించి అక్కడ అందిస్తున్న సౌకర్యాల పైన ఆరా తీశారు మంత్రి కేటీఆర్. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు.
ప్రభుత్వం అవసరమైన వారందరికీ, వరద వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రేషన్ కిట్ లతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను అందించేందుకు జిహెచ్ఎంసి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీలు వరద నుంచి తెరుకుంటున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రజలంతా ఖచ్చితంగా తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని..కాచివడపోసిన నీటిని తాగాలని సూచించారు. వరద ప్రభావిత కాలనీ లలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని.. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామన్నారు. షెల్టర్ హోమ్ లో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతోపాటు దుప్పట్లు మందులు అందిస్తున్నామని తెలిపారు.

Related posts