ఐపీఎల్ 2020 లో కోల్ కత నైట్ రైడర్స్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండుసార్లు టైటిల్ అందుకుంది. కానీ 2018 వేలంలో గంభీర్ ఢిల్లీ జట్టు కొనుగోలు చేయడంతో కేకేఆర్ తమ జట్టుకు కెప్టెన్ గా దినేష్ కార్తీక్ ను ఎంచుకుంది. అయితే కార్తీక్ న్యాయకత్వం లో 2018 లో మూడో స్థానంలో నిలిచిన కేకేఆర్ గతఏడాది 5 వ స్థానానికి పరిమితమైంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా కోల్ కత తమ స్థాయి ప్రదర్శన చేయడం లేదు. దాంతో జట్టు వైఫల్యానికి కార్తీక్ కారణమంటూ అభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో 7 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 4 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. తమ 8 వ మ్యాచ్ ఈ రోజు కేకేఆర్ ముంబై తో ఆడనుంది. కానీ ఏ మ్యాచ్ కు ముందు అనూహ్యంగా కేకేఆర్ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్ బాధ్యతలను ఆ జట్టులోని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే మోర్గాన్ ను ఈ ఏడాది వేలంలో కేకేఆర్ 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. మరి మొదటిసారి ఐపీఎల్ లో జట్టుకు న్యాయకత్వం వహించనున్న మోర్గాన్ ఎలా కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తాడు అనేది చూడాలి.
previous post