telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదు: భట్టి విక్రమార్క

Batti vikramarka

తెలంగాణ రాష్ట్ర ప్రజలు డెంగీ, మలేరియా, విష జ్వరాలతో అల్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులన్నీ దుర్భరంగా ఉన్నాయన్నారు. ఏం.ఆర్.ఐ. సిటీ స్కాన్, బ్లడ్ ప్లేట్ లెట్ సేపరేటర్ ఎక్విప్ మెంట్, ఈసీజీ, ఎక్స్ ప్లాంట్ లేవని భట్టి వివరించారు.

తాను రాజకీయాల కోసం ఆసుపత్రుల్లో తిరగడం లేదని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన పరికరాలు, మందులు లేనప్పటికీ మంత్రి ఈటెల అంతా బాగుందని మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లోనూ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

Related posts