telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సినేషన్ సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. తెలంగాణలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి డోసు పూర్తిచేసుకుని రెండో డోసు కోసం అర్హత కలిగిన వారు దగ్గరలో వున్న ప్రభుత్వ వాక్సినేషన్ కేంద్రానికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సిఎం కోరారు. సూపర్ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు సంబంధించిన విదివిధానాలను రూపొందించాలని మంత్రి హరీష్ రావును వైద్యారోగ్యశాఖ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Related posts