ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రజలెవరూ అధైర్యపడవద్దని, తాను కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. తాను కోలుకునే వరకు తన వద్దకు ఎవరూ రావద్దని కోరారు.ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు.
దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న జగనే దళితద్రోహి : కే.ఎస్. జవహర్ (మాజీ మంత్రి)