వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొంత కాలంగా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో నటించే అంశంపై స్పందించారు.
గతంలో రోజా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా రోజా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, చిరంజీవి, నాగార్జున సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని పేర్కొన్నారు.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్