telugu navyamedia
క్రీడలు వార్తలు

రాహుల్ ది చెత్త కెప్టెన్సీ అంటున్న ఆశిష్ నెహ్రా…

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీనే కారణమని ఆశిష్ నెహ్రా తెలిపాడు. మైదానంలో అతని అనాలోచిత నిర్ణయాలే పంజాబ్ కింగ్స్ కొంపముంచాయన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన నెహ్రా.. రాహుల్ తీరును తప్పుబట్టాడు. బౌలర్లు వాడుకున్న విధానం ఏ మాత్రం బాలేదని విమర్శించాడు. పంజాబ్ కింగ్స్ కోచ్, కెప్టెన్ తదుపరి మ్యాచ్‌లకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని చురకలింటించాడు. ‘ఈ టీ20 ఫార్మాట్‌లో ప్రతీ ప్లేయర్‌కు కొన్ని విషయాలు కామన్‌గా ఉంటాయి. బ్యాటింగ్ బాగా చేయడం, బౌలింగ్‌లో సత్తా చాటడం, సూపర్ ఫీల్డింగ్‌‌తో అదరగొట్టడం, రాణించడం, విఫలమవడం అన్నీ ఆటలో ప్రతీ ఒక్కరికి సహజమే. కానీ కొన్ని మాత్రం కెప్టెన్ అదుపులోనే ఉంటాయి. కనీసం వాటినైనా సమర్థవంతంగా నిర్వహించాలి. అత్యధిక ధర పెట్టి కొన్న ఓవర్‌సీస్ బౌలర్లతో పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయించలేదు. 10 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు వచ్చిన మెరిడిత్‌ తన ఫస్ట్ ఓవర్‌లోనే స్మిత్ వికెట్ తీశాడు. ఆఖరికి షమీ కూడా నాలుగు ఓవర్లను నాలుగు స్పెల్స్‌లో వేసాడు. అర్ష్‌దీప్‌కు అధిక ప్రాధానత్య ఇస్తూ ప్రారంభంలోనే బౌలింగ్ చేయించారు. ఇలా గేమ్‌ను ఎక్కడ కంట్రోల్‌ ఉంచలేదు’అని రాహుల్‌ కెప్టెన్సీని నెహ్రా తప్పుబట్టాడు.

Related posts